ఏకధాటిగా వర్షాలు - ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు : సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా సింగరేణి సంస్థ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఉపరితల గనుల్లో రోజుకు వంద టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లో భారీగా వరద చేరడంతో భారీ యంత్రాలు యార్డుకే పరిమితమయ్యాయి.
మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనివల్ల మట్టిని తొలగించే పనులు, బొగ్గు ఉత్పత్తి రెండూ నిలిచిపోయాయి. గనులకు వెళ్లే దారులు బురదమయంగా మారి, రవాణాకు ఆటంకం ఏర్పడింది. షవల్స్, డంపర్లు సహా ఇతర భారీ యంత్రాలు యార్డులకే పరిమితమయ్యాయి.
వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం : ఈ రెండు జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో మొత్తం ఐదు ఉపరితల గనులు ఉన్నాయి. బుధవారం ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో సుమారు 29,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. శ్రీరాంపూర్ ప్రాంతంలో 15,220 టన్నులు, బెల్లంపల్లిలో 7,400 టన్నులు, మందమర్రి ప్రాంతంలో 6,407 టన్నుల మేర ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల నుంచి కొత్తగా బొగ్గును వెలికితీసే పనులు నిలిచిపోయినప్పటికీ, డంప్ యార్డుల్లో ముందుగానే నిల్వ ఉంచిన బొగ్గును రవాణా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
నీటిని బయటకు పంపే ఏర్పాట్లు : ఉపిరితల గనుల్లోని పని ప్రదేశాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. వర్షాలు కొనసాగితే మరింత నీరు చేరే అవకాశం ఉందని భావించి, వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటిని నిరంతరాయంగా బయటకు పంపడానికి అధిక సామర్థ్యం గల మోటార్లను ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు వీలుగా అంతర్గత రహదారులను సిద్ధం చేస్తున్నారు. అలాగే మట్టిని తొలగించే పనులు, బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఉన్న పరిస్థితుల గురించి సంస్థ డైరెక్టర్ ఆయా ప్రాంతాల అధికారులతో మాట్లాడి ఆరా తీస్తున్నారు.
భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం : పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ రావు మండలం తాడిచెర్ల ఓసి 1 ఉపరితల బొగ్గు గనిలో భారీగా వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పై తీవ్రంగా ప్రభావం పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. అలాగే పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని ఆర్ జి త్రీ పరిధిలోని ఓసిపి 1, ఓసిపి 2లలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం చూపాయి. ఓసిపి 1, 2 బొగ్గు బావుల్లో వర్షాలతో 18,000 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో మొత్తం బురదమైయింది. మట్టి తవ్వకాలకు వర్షం ఆటంకం కలిగిస్తున్నది. ఓసి 1లో 5000 టన్నులు, ఓసీ 2లో 14000 టన్నుల మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి.