🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 30 Jul, 2026 | Page: 1

తెలంగాణ యువ ఇంజినీర్లకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ ( Criminal Waste ) అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు ( KTR ) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. వెంటనే యువ ఇంజినీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారుతెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా? ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి గతాన్ని ప్రజలు మరచిపోలేదని, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం బ్లాక్‌మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందని విమర్శించారు.
🏠 Home