🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 01 Aug, 2026 | Page: 1

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్-2026 నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ పంపిణీ కొనసాగుతున్నందున అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.అయితే మూడు నెలల బియ్యం పొందాలంటే రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని కోరారు. చిన్నారుల ఈ-కేవైసీని ఐరిస్ (Iris) పరికరం ద్వారా నమోదు చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.ఈ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ఎలాంటి ఆటంకం లేకుండా అందుతుందని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులను గుర్తించి వ్యక్తిగతంగా సమాచారం అందించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
🏠 Home