🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 02 Aug, 2026 | Page: 1

ఘోరం.. కుప్ప‌కూలిన టూరిస్ట్ విమానం..

పెరూ (Peru) లో ఘోర విమాన ప్రమాదం (Flight Crash) జ‌రిగింది. పర్యాటకులతో వెళుతున్న టూరిస్ట్ విమానం (Tourist Flight) కుప్పకూలింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరూలోని నజ్‌కా మున్సిపాలిటీలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. న‌జ్‌కా మున్సిప‌ల్‌ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పెరూవియన్ కంపెనీ (Peruvian Company) కి చెందిన ఎరోడియానా టూరిస్ట్ విమానం 11 మంది టూరిస్టులు, ఇద్దరు విమాన సిబ్బందితో ఇకా ప్రాంతం నుంచి బయలుదేరింది.
నజ్‌కా సిటీ బయట ఆ విమానం ప్రమాదానికి గురైంది.
🏠 Home