స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్..
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఆహార డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇటీవల రాపిడో కూడా 'ఓన్లీ' (Ownly) పేరుతో ఈ రంగంలోకి ప్రవేశించగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా పోటీకి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం రెస్టారెంట్ల నుంచి సుమారు 10 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయాలని యోచిస్తోంది. తక్కువ కమిషన్‌తో ఎక్కువ రెస్టారెంట్లను ఆకర్షించాలన్న వ్యూహాన్ని సంస్థ అమలు చేస్తోంది. మొదటి దశలో బెంగళూరులో సేవలను ప్రారంభించిన తర్వాత వినియోగదారుల స్పందనను బట్టి ఇతర నగరాలకూ విస్తరించాలని ఫ్లిప్‌కార్ట్ ప్రణాళిక రూపొందించింది (Flipkart food app).