🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 03 Aug, 2026 | Page: 1

‘వారణాసి’ తర్వాత మహేష్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకోగా, ఇంకా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనే అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయనే విషయం తెలిసిందే. అయితే ‘వారణాసి’ తర్వాత మహేష్ ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే చర్చలు ఇప్పటికే ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇద్దరు ప్రముఖ దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

🏠 Home