🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 05 Aug, 2026 | Page: 1

బ‌రువు త‌గ్గే ప్ర‌ణాళిక‌లో ఉన్నవారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు సాధారణంగా అల్పాహారంపై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే మధ్యాహ్న భోజనం కూడా అంతే ముఖ్యమైంది. సరైన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి, అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణ మరింత సులభత‌ర‌మవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే లక్ష్యంతో ఉన్నవారు మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలను చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గోధుమ రొట్టెలు, హోల్ వీట్ శాండ్‌విచ్‌లు లేదా ఓట్స్‌తో చేసిన వంటకాలు తీసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు ఆకలి అవ‌కుండా ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచి రోజులో మిగిలిన సమయానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే ఉదయం అల్పాహారంలో ఇప్పటికే తగిన మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకున్నట్లయితే మధ్యాహ్నం వాటి పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.

🏠 Home