అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం..
అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఆస్తి నష్టంగానీ జరగలేదు.