🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 07 Aug, 2026 | Page: 1

నా జీవితాన్ని ఒక్కరి కోసం మార్చుకోలేను..

ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీషా పటేల్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 51 ఏళ్ల వయసులోనూ అవివాహితగా కొనసాగుతున్న ఆమె, పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్ జీవితంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో ఓ అభిమాని.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించాడు. దీనికి ఏమాత్రం సందేహించకుండా అమీషా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం నా జీవితాన్ని, నా ఆనందాన్ని పూర్తిగా మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు అని ఆమె సమాధానం ఇచ్చారు. అమీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అభిప్రాయానికి కొందరు నెటిజన్లు మద్దతు తెలుపుతూ.. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా గడిపే హక్కు ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి అనేది పరస్పర అవగాహన, ప్రేమ, సహజీవనానికి ప్రతీక అని అభిప్రాయపడుతున్నారు.
🏠 Home