మీ వయస్సు 40 దాటిందా..ఈ పరీక్షలు చేయించుకోవాలి..
వయస్సు 40 ఏండ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలుచేయించుకోవాల్సి ఉంటుంది. నలభై ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అయితే 40 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లడ్ షుగర్ టెస్ట్
ఒకప్పుడు వయస్సు పైబడిన వారు మాత్రమే మధుమేహం బారినపడే వారు. ఇప్పటి ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవనశైలితో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. అందుకే కనీసం 40 ఏళ్లు దాటిన తర్వాతనైనా ప్రతి ఒక్కరూ బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కొలెస్ట్రాల్ టెస్ట్
ఒకప్పటితో పోల్చిచూస్తే ఇప్పటి ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు వచ్చాయి. జనం ఇన్‌స్టంట్ ఫుడ్స్‌కు బాగా అలవాటుపడ్డారు. దాంతో చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తున్నది. రక్తంలో కొవ్వు శాతం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే 40 ఏండ్లు దాటిన వారు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
బీపీ టెస్ట్
ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా ఒత్తిళ్లతో కూడుకుని ఉన్నది. మనిషులు సంపాదన వేటలో పడి మానసిక ఒత్తిళ్లలో చిక్కుకుంటున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సరైన విశ్రాంతి లేక బీపీ, షుగర్ లాంటి జీవనశైలి వ్యాధులబారిన పడుతున్నారు. కొందరు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి 40 ఏండ్ల తరచూ బీపీ పరీక్షలు చేయించకోవడం మంచిది.
థైరాయిడ్ టెస్ట్
బీపీ, షుగర్ మాదిరిగానే థైరాయిడ్ కూడా జీవనశైలి వ్యాధి. ఈ థైరాయిడ్‌లో హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం అని రెండు రకాలు ఉంటాయి. థైరాయిడ్ కారణంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే 40 ఏండ్లు దాటగానే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.
విటమిన్ లెవెల్స్ టెస్ట్
మనం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి విటమిన్‌లు, ఖనిజాలు చాలా అవసరం. అయితే ఈ విటమిన్‌లు, ఖనిజాలు ఏదీ ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే విటమిన్‌లు, మినరల్స్ సమపాళ్లలో అందేలా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అందుకోసం 40 ఏండ్ల పైబడిన వాళ్లు తరచూ విటమిన్ మోతాదులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.
గుండె పరీక్షలు
షుగర్, బీపీ, హైకొలెస్ట్రాల్ లాంటి జీవనశైలి వ్యాధులు క్రమంగా గుండె జబ్బులకు దారితీస్తాయి. కొవ్వు కారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నరాల్లో బ్లాక్స్ రావడం, అదేవిధంగా గుండె కండరాలు బలహీనపడం లాంటి సమస్యలు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే 40 ఏండ్లు దాటిన వాళ్లు గుండె పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం.