🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 09 Aug, 2026 | Page: 1

ఘనంగా బోనాల పండుగ..

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో బోనాల పండుగ ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు మహిళలు, కుటుంబ సమేతంగా కొత్త కుండల్లో బోనాలు తయారు చేసి సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల కుండలను ఇంటి వద్ద నుంచి డప్పు వాయిద్యాల నడుమ కారేపల్లి క్రాస్ రోడ్డు ప్రాంతంలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ,ఎర్రమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
🏠 Home