మెడికో ప్రియాంక మృతదేహానికి దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది.
మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈనెల 3న దుండగులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన మెడికో ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బ్రెయిన్‌డెడ్‌తో ఆమె మృతిచెందినట్టు సికింద్రాబాద్‌లోని కిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.