🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 11 Aug, 2026 | Page: 1

రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురి అరెస్ట్

హైదరాబాద్ : హైదర్ షా కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. హైదర్ షా కోటలోని తన అత్తగారింటికి బోనాల పండుగ సందర్భంగా అతడు వచ్చారని చెప్పారు. తన బావమరిది వికాస్ గౌడ్‌తో కలిసి పార్టీ చేసుకున్నారని అన్నారు. అనంతరం తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని లంగర్ హౌస్ వైపు వారంతా కారులో అతి వేగంగా బయలుదేరారని పేర్కొన్నారు.
🏠 Home