థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు
థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహాయంపై వివరాలు సేకరించారు. విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి పంపించారు. థాయ్‌లాండ్‌లో స్థానిక కరెన్సీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు.