🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 12 Aug, 2026 | Page: 1

ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ‌కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు ‘ఓస్చాడ్‌బ్యాంక్‌)’ తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది. ఈ వివాదంపై 1998లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద విచారణ జరుగుతోంది.రష్యా సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిఝియా ప్రాంతాల్లో తమ ఆస్తులకు, కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఓస్చాడ్‌బ్యాంక్ ఈ కేసు దాఖలు చేసింది. ముఖ్యంగా 2022 తర్వాత జరిగిన పరిణామాలతో వందల మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని పరిహారం కోరుతోంది. ఈ మేరకు 2025 జూలైలో వివాద పరిష్కారం కోసం రష్యాకు నోటీసులు పంపినా స్పందన రాకపోవడంతో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది
🏠 Home