🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 12 Aug, 2026 | Page: 1

తెలిసీ తెలియక తప్పు జరిగి ఉంటే క్షమించండి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్‌తో తలెత్తిన విభేదాలు మరియు వివాదాల పట్ల జానీ మాస్టర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. గత కాలపు పొరపాట్లను పక్కనపెట్టి మళ్లీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకున్నామని, కొంతకాలం అసోసియేషన్‌కు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ అందరితో కలిసి పనిచేసేందుకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఇకపై అందరం ఒకే కుటుంబంలా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
🏠 Home