చికిత్స పొందుతూ హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి
హసన్‌పర్తి మండలం గంటూర్‌పల్లికి చెందిన భరత్ చందర్ ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉంటున్నారు. చదువు పూర్తవ్వడంతో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే అగ్నిప్రమాదానికి గురయ్యాడు. గత నెల 25వ తేదీన జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 75 శాతం శరీరం కాలడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే 15 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న భరత్.. తుదిశ్వాస విడిచారు.భరత్ మృతితో అతని స్వగ్రామమైన గుంటూర్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు పూర్తి చేసుకుని తిరిగొస్తే పెళ్లి చేద్దామని అనుకుంటే.. ఇంతలోనే ఇలాంటి విషాద వార్త వినాల్సి వచ్చిందని భరత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నారు.