కొలంబియాలో భూకంపం.. మృతుల సంఖ్య 250 దాటింది.
కొలంబియాలో భూకంప మృతుల సంఖ్య 250 దాటింది. సోమవారం 7.4 తీవ్రతతో ఆ దేశాన్ని భూకంపం షేక్ చేసిన విషయం తెలిసిందే. పెరిరా, కాలి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవంతులు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద ఇంకా వందల సంఖ్యలో జనం చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పర్వత ప్రాంతమైన పశ్చిమ కొలంబియాలో ప్రస్తుతం ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇండ్లు, స్కూళ్లు, హెల్త్ సెంటర్ల భవనాలన్నీ పగుళ్లు వచ్చాయి. వేర్వేరు నగరాల్లో నమోదు అయిన డేటా ప్రకారం ఇప్పటి వరకు 254 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.