🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 12 Aug, 2026 | Page: 1

మాషా అల్లా స్కాం బాధితులకు న్యాయం చేస్తాం

మీకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాషా అల్లా స్కాం బాధితులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మాషా అల్లా బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ గ్రీవెన్స్‌లో దాదాపు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత్ మాట్లాడుతూ.. ఈ స్కాంపై తక్షణమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు.బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ బాధితుల సమస్యపై విజయవాడ పోలీస్ కమిషనర్‌తో ఆమె మాట్లాడారు. ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామనే మోసపూరిత హామీలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. పేదల కష్టార్జితాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
🏠 Home