మేడ్చల్ కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో అగ్నిప్రమాదం..
దేవరాయాంజాల్‌లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతకంతకూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.