పెరిగిన పసిడి ధరలు..
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజు (బుధవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,040 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,860 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,950 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,140 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది