రెంటల్ vs పర్సంటేజీ వివాదం- అసలు తేడా ఏంటి? ఏ విధానంలో ఓనర్లకు ఎంత మిగులుతుంది?
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఒక పెద్ద వివాదం అందరిని ఆలోచనలో పడేసింది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు థియేటర్ల యజమానులు ఏకంగా ఎగ్జిబిషన్ ఆపేస్తామంటూ నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపించాయి. పర్సంటేజీ విధానం కావాలంటూ ఆ మధ్య ఏకంగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాను కూడా రాష్ట్రంలో ఆడనివ్వమని తేల్చి చెప్పారు. కానీ చిరంజీవి మధ్యలోకి వెళ్లి ఆ వివాదం పెద్దది కాకుండా సాల్వ్ చేశారు. అసలు ఇన్నాళ్లూ సవ్యంగా సాగుతున్న ఇండస్ట్రీలో సడెన్‌గా ఈ పర్సంటేజీ గోల ఏంటి, పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
రెంటల్ విధానంలో అసలు సమస్య
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ రెంటల్ విధానంలో నడుస్తున్నాయి. ఈ పద్ధతి ప్రకారం ఒక సినిమాకు కోటి రూపాయల గ్రాస్ వస్తే, అందులో థియేటర్ యాజమాన్యానికి కేవలం ఏడు లక్షల రూపాయలు అద్దె రూపంలో మిగులుతుంది. అదే చిన్న సినిమాల విషయానికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. థియేటర్‌కు వచ్చే జనం ఒక శాతం ఉన్నా, లేదా వంద శాతం హౌస్‌ఫుల్ అయినా సరే రోజూవారీ లేదా వారం లెక్కన ఫిక్స్‌డ్ అద్దె మాత్రమే చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకుంటారు.
పర్సంటేజీ విధానంతో మారే లెక్కలు
థియేటర్ ఓనర్లు డిమాండ్ చేసిన పర్సంటేజీ విధానం అమలైతే లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఈ సిస్టమ్ ప్రకారం నిర్మాతలు తమకు వచ్చే ఆదాయంలో మొదటి వారం 45 నుంచి 55 శాతం వాటాను థియేటర్ యజమానులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతి వారాల్లో ఈ పర్సంటేజీ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఒక సినిమా కనీసం మూడు వారాలు ఆడి కోటి రూపాయలు వసూలు చేస్తే, అందులో థియేటర్ వాళ్లకు సగటున 35 శాతం వరకు షేర్ దక్కే అవకాశం ఉంటుంది.
మల్టీప్లెక్స్‌లకు ఒక న్యాయమా?
ఈ పర్సంటేజీ సిస్టమ్ ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్‌లు అన్నీ ఇదే విధానంలో నడుస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లకు ఒక న్యాయం, సింగిల్ స్క్రీన్లకు మరో న్యాయం ఎందుకని యజమానులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని, పాత పద్ధతిలో వస్తున్న ఏడు లక్షలతో కరెంటు బిల్లులు, స్టాఫ్ జీతాలు కూడా కట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమకు కూడా పర్సంటేజీ విధానమే కావాలని పట్టుబడుతున్నారు.