🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

సర్ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయా? - సమాధానాలు ఇవే!

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. కానీ దీనిపై ఓటర్లలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్పై రాజకీయ పార్టీల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు తరచూ అడుగుతున్న ప్రశ్నలకు సర్ అధికారులు సమాధానమిచ్చారు. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఓటర్ల ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన సమాధానలు ఇవే.

ఎస్ఐఆర్ అంటే ఏంటి? : ఓటర్లు వలస వెళ్లడం లేదా మృతి చెందటం అలాగే మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరుపుతారు. ఆ తర్వాత అర్హులైన వారిని మాత్రమే ఉంచి, అనర్హులను తొలగిస్తారు. దీనినే సర్ ప్రక్రియ అంటారు. మరి దీనిని ఈసారి ఏ పద్ధతిలో నిర్వహిస్తున్నారనే దానిపై అధికారులు మరింత స్పష్టంగా వివరించారు.
🏠 Home