🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలల పనివేళల్లో మార్పు

హనుమకొండ, జూన్ 16 (సుదీక్ష న్యూస్):ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్న కళాశాలల పని వేళలను తాజా నిర్ణయం ప్రకారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేశారు.

ఈ నిర్ణయం పట్ల టిగారియా (TIGARIA) ఆధ్వర్యంలో డిగ్రీ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, సొసైటీ సెక్రటరీ కంభంపాటి శారద, ఓఎస్డీ డాక్టర్ స్నేహలతలకు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.

టిగారియా డిగ్రీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ ఐ. రాధిక, ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. సత్య శ్రీదేవి మాట్లాడుతూ, ఈ నిర్ణయం అధ్యాపకుల పని భారం సమతుల్యం చేయడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు, కళాశాలల సమర్థవంతమైన నిర్వహణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కొత్త పనివేళల అమలు ద్వారా అధ్యాపకులు, విద్యార్థులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
🏠 Home