🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

నేటి నుంచే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ - జూన్ 25 నుంచి వెబ్ ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈరోజు నుంచి స్లాట్‌ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 22వ తేదీ నుంచి పది, ఇంటర్‌ విద్యార్హత, క్యాస్ట్, ఇన్కమ్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

కాలేజీలు, కోర్సుల కోసం వెబ్ ఆప్షన్లు : ఈసారి కొత్తగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్సిటీ పరిధిలోని హుస్నాబాద్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సైతం సెంటర్‌ను కేటాయించినట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితేనే కన్వీనర్‌ కోటాలో కౌన్సెలింగ్‌ ద్వారా సీటు కోసం పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. జూన్ 25వ తేదీ నుంచి విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
🏠 Home