🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

హనుమకొండలో నేడు ద్వితీయ జాతీయ లోక్ అదాలత్

హనుమకొండ, జూన్ 19 (సుదీక్ష న్యూస్): తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ద్వితీయ జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ 20న ఉదయం 9:45 గంటలకు జిల్లా కోర్టు సముదాయంలోని 10 కోర్టుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ వెల్లడించింది.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ వ్యవస్థకు చెందిన గౌరవ న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రజలకు సత్వర, సులభ, సామరస్యపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడంలో లోక్ అదాలత్‌ల ప్రాముఖ్యతను వివరించనున్నారు.
🏠 Home