వరంగల్‌లోనూ భూముల అమ్మకం.
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్‌స్టాండ్‌కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భూమిని గుంప గుత్తగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లుచేసింది.హనుమకొండ, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్‌స్టాండ్‌కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భూమిని గుంప గుత్తగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లుచేసింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా రెండు ఎకరాలను కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఈ ఒక్క భూమినే విక్రయిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ గతంలో చేసిన మరో మూడు వెంచర్లతోని ఖాళీ ప్లాట్లను వేలం వేస్తున్నారు.