🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

హాలీవుడ్‌లో విషాదం..

హాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన ‘ఫ్రెండ్స్’, ‘చీర్స్’ వంటి ఐకానిక్ అమెరికన్ సిట్‌కామ్‌ల దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూశారు. 85 ఏళ్ల బరోస్ శుక్రవారం రాత్రి నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషాద వార్త తెలియగానే హాలీవుడ్ పరిశ్రమతో పాటు ‘ఫ్రెండ్స్’ వెబ్ సిరీస్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ ప్రియమైన దర్శకుడికి నివాళులర్పించారు.

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో జేమ్స్ బరోస్ దాదాపు 1000కి పైగా టెలివిజన్ ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. ‘ఫ్రెండ్స్’తో పాటు చీర్స్, ఫ్రేజియర్, విల్ అండ్ గ్రేస్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, టూ అండ్ ఏ హాఫ్ మెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కామెడీ షోలను ఆయన రూపొందించారు. తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు గానూ ఆయన ఏకంగా 11 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు.
🏠 Home