🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

1969 తెలంగాణ ఉద్యమ నాయకుల సమావేశం – పలు కీలక తీర్మానాలు

వరంగల్, జూన్ 20 సుదీక్ష న్యూస్ : 1969 తెలంగాణ ఉద్యమ నాయకుల సమావేశం శనివారం వరంగల్‌లో సోమరాతి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి తిప్పన సిద్దులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యమ నాయకులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం, 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించడం, ఆ నాటి పోలీసు రికార్డుల ఆధారంగా గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా తెలంగాణ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో అమరులైన వీరుల స్మారకార్థం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సమీపంలో అమరవీరుల స్థూపం నిర్మించాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో తిప్పన సిద్దులు, సోమరాతి సత్యనారాయణ, భూర లింగమూర్తి, పులి సారంగపాణి, ఎం.డి. రాజ్ మహమ్మద్, చేరి నాగేశ్వరరావు తదితర ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను స్మరించుకుంటూ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home