3 లక్షల మంది అవుట్ పేషెంట్లు - 90 వేల మంది ఇన్‌పేషెంట్లు : క్యాన్సర్ బాధితుల ఆశాకిరణం బసవతారకం
క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాద్‌లో ప్రారంభించిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఎంతో మందికి సేవలు అందిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మానవత్వం, సేవాభావంతో క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ బసవతారకం హాస్పిటల్ రజతోత్సవాలు గత ఏడాది ప్రారంభం కాగా, ముగింపు కార్యక్రమం నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించనున్నారు.
నోవాటెల్‌లో ముగింపు వేడుకలు : బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సహా తెలుగు రాష్ట్రాల మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆసుపత్రి సేవలతో అనుబంధం కలిగిన అతిథులు హాజరు కానున్నారు.
వంద పడకలతో ప్రారంభమై - ప్రస్తుతం 650కి : ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను లాభాపేక్ష లేకుండా అందించేందుకు 1988లో నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు మొగ్గ తొడిగింది. వైద్య రంగ నిపుణులు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటుకు బలమైన పునాదులు పడగా, 2000 జూన్ 22న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ చేతుల మీదుగా 100 పడకలతో హాస్పిటల్ ప్రారంభమైంది. అనంతరం సేవలు విస్తరించుకుంటూ ప్రస్తుతం 650 పడకల కెపాసిటీతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ సంస్థగా ఎదిగింది.
ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌లు కూడా : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏటా 3 లక్షల మందికిపైగా అవుట్ పేషెంట్లు, సుమారు 90 వేల మంది ఇన్ పేషెంట్లకు ఆసుపత్రి విస్తృతంగా సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 8 వేలకు పైగా క్యాన్సర్ సర్జరీలు, 86 బోన్ మ్యారో మార్పిడీ చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. క్యాన్సర్ చికిత్స కోసం బసవతారకం హాస్పిటల్‌ను ఆశ్రయించే వారిలో 65 శాతానికి పైగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారే ఉంటున్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలను బసవతారకం అందిస్తోంది.
పాలియేటివ్ కేర్, మొబైల్ స్క్రీనింగ్ : తల, మెడ, ప్రొస్టేట్, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలను ఈ ఆసుపత్రిలో అందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 250 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు సేవలు అందించే ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్‌ను కూడా బసవతారకం ఆసుపత్రి నిర్వహిస్తోంది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు లక్ష్యంతో మొబైల్ స్క్రీనింగ్ బస్సు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు టెస్టులు నిర్వహిస్తోంది.