24 గంటల్లో రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ - 5 రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి మరింతగా విస్తరించాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నర్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గురువారం ఈ జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో సోమవారం 7.9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.1, మంచిర్యాల జిల్లా తాండూర్‌లో 3.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
మరోవైపు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వాన : హైదరాబాద్‌లో పలుచోట్ల సోమవారం వాన దంచికొట్టింది. నిన్న ఉ.8.30 నుంచి ఇవాళ ఉ.6 వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్‌లో 12.8, రామచంద్రాపురంలో 12.1 సెం.మీ, లింగంపల్లిలో 11.9, మియాపూర్‌లో 11.4 సెం.మీ, మైలార్‌దేవ్‌పల్లిలో 11.1, గచ్చిబౌలి 10.3 సెం.మీ, హఫీజ్‌పేటలో 8.5, అమీన్‌పూర్‌లో 7.7 సెం.మీ, పటాన్‌చెరులో 7.6, మాదాపూర్‌లో 6.4 సెం.మీ, షేక్‌పేటలో 6.1, బాచుపల్లిలో 5.7, మణికొండలో 5.4 సెం.మీ, కూకట్‌పల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఏపీలో ఆరెంజ్ అలర్ట్ జారీ : మరోవైపు ఏపీలో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం, పిడుగులు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన రుతుపవనాల కదలిక : ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గడంతో తెలంగాణలోని వాతావరణంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాలో వడగాల్పుల తీవ్రత ఎండాకాలం మాదిరేగానే ఉంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులుపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వర్షాలు కురిసే ముందు గాలులు తీవ్రంగా వీయడంతో కరెంటు స్తంభాలు, చెట్లు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు విపత్తు నిర్వహణ, విద్యుత్, పోలీసు వంటి ఇతర శాఖలు వేగంగా సమన్వయం చేసుకుంటూ పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.