ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం: దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ, జూన్ 25 (సుదీక్ష న్యూస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ జులైవాడ 117వ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బీఎల్వోతో కలిసి ఓటర్లను కలిసి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన హక్కు అని, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, డబుల్, మృతుల పేర్లు తొలగించేలా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తోందని తెలిపారు.