ఇంత కన్ఫ్యూజ్ చేసే యాక్సిడెంట్‌ను ఎక్కడా చూసుండరు.
ఢిల్లీలోని కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఆకాన్ష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశాడు. ‘కనౌత్ ప్రాంతంలో చోటుచేసుకున్న వింత యాక్సిడెంట్‌ను చూశా. ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు’ అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏముందంటే.. యాక్సిడెంట్ తర్వాత కారు ఫుట్‌పాత్ సమీపంలోని చెట్టు దగ్గర ఆగిపోయింది. అయితే, ఆ కారు అంత పర్‌ఫెక్ట్‌గా అక్కడికి ఎలా వచ్చి చేరిందన్నది మిస్టరీగా మారింది.
కారు ఎడమ వైపు ముందు భాగం బాగా దెబ్బతింది. ఆ భాగం చెట్టుకు ఆనుకుని ఉంది. రోడ్డు మీద నుంచి చూస్తే ఆ కారు భవనం ఉన్న వైపు నుంచి దూసుకుచ్చి చెట్టును ఢీకొట్టినట్లుగా ఉంది. అయితే, ఆ భవనం వైపు నుంచి రావటానికి ఎలాంటి మార్గం లేదు. కారు చెట్టును ఢీకొట్టి పక్కకు తిరిగిందనుకుంటే.. ఫుట్‌పాత్‌లాంటి ఆ ప్రదేశంలో మొక్కలు నాటి ఉన్నాయి. ఆ మొక్కలకు ఏమీ కాకుండా ఆ కారు ఎలా అటు వైపు వెళ్లింది అన్నది అంతుచిక్కని ప్రశ్న. కారును ఎవరో చేతులతో ఎత్తి మొక్కలు, చెట్టు మధ్య ఉంచినట్లుగా ఆ దృశ్యం ఉంది.