ఆర్‌ఎస్ ప్రవీణ్ భద్రతపై ప్రభుత్వ విప్ దయాకర్ కీలక వ్యాఖ్యలు.
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతపై అనుమానాలు అవసరం లేదు అని అన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన వ్యక్తిగత భద్రత విషయంలో అనవసర అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు దయాకర్. ఆయన భద్రతకు సంబంధించి అవసరమైన నిర్ణయాలు పోలీసు శాఖ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన భద్రతను తగ్గించుకున్నారని దయాకర్ తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో గతంలో ఉండే జామర్, అంబులెన్స్ వంటి వాహనాలు ప్రస్తుతం లేవని, మొత్తం మూడు వాహనాలతోనే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా, సీఎం ప్రయాణాలకు ప్రత్యేక ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.