🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 07 Jul, 2026 | Page: 1

దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) రంపచోడవరం మండలం పందిరి మామిడిలో నీరా ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో బీసీలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో 1,608 మంది బీసీలు పదవులు కోల్పోయారని తెలిపారు.
వైసీపీ నేతలు బీసీ రౌండ్‌టేబుల్ పేరుతో కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. ఏపీకి పెట్టుబడులు రావడం జగన్‌కు ఇష్టం లేదని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల లిక్కర్ స్కాం దేశంలోనే పెద్దదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. పనికిరాని బ్రాండ్లతో వేలకోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం మద్యంతో వేలమందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. కేరళ, గోవా తరహాలో రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
🏠 Home