🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 09 Jul, 2026 | Page: 1

పెట్టుబడుల పేరుతో మోసం..

పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ (Metalloid) సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టర్ల కోసం చూసిన మెటాలాయిడ్ సంస్థను అమెరికాకు చెందిన దిలీప్ అనే వ్యక్తం మోసం చేశాడు. అమెరికాకు చెందిన అవ్నీ (Avni) అనే సంస్థ ప్రతినిధి దిలీప్.. మెటాలాయిడ్ సంస్థలో 50 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెడతానని నమ్మించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందుకు కోసం బ్యాంక్ గ్యారంటీలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు ఖాతాల వివరాలను సంస్థకు చూపించాడు దిలీప్.
🏠 Home