NEET-2026 ఎంట్రన్స్ ఫలితాలలో 'షైన్' విద్యార్థుల విజయకేతనం
హనుమకొండ జూలై 17 (సుదీక్ష న్యూస్) :
NEET-2026 ఎంట్రన్స్ ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలకు
సమానంగా ఫలితాలు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు రమ,కవిత,రాజేంద్రకుమార్,మూగుల రమేష్లు సంయుక్తంగా తెలియజేశారు.ఈ సందర్భంగా
మూగుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ... షైన్ విద్యాసంస్థలు మొదటి నుండి నీట్,జేఈఈ మెయిన్స్,అడ్వాన్స్ లో అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో ఎం.డి. అకీబ్ అలి (Roll No.4205110050)-504, ఎమ్. నలిన్ ప్రభాత్ (Roll No. 4205105052)-480,టి.హాసిని (Roll No.4205101058)-406, ఎస్. సాయిప్రశాంతి (Roll No. 4205108135) 396 మార్కులు సాధించడం సంతోషంగా
ఉందన్నారు.వీరితోపాటు 15 మంది విద్యార్థులు 350 మార్కులకు పైగా సాధించి విజయభేరి మోగించినట్లు
తెలిపారు.ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కుమార్ యాదవ్,యాజమాన్యం అభినందించారు.ఈ కార్యక్రమoలో షైన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్,ప్రశాంత్,అధ్యాపక బృందం,విద్యార్థినీ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.