🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 18 Jul, 2026 | Page: 1

యాదగిరిగుట్ట ఆలయంలో పరిచారక అర్చకుడిగా నియామక పత్రం అందుకున్న శ్రీ హర్ష శరవణ కుమార్

హనుమకొండ, జూలై 18 (సుదీక్ష న్యూస్): ఉకల్ నాగేంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ సముద్రాల సుదర్శన్ ఆచార్యుల సుపుత్రుడు సముద్రాల శ్రీ హర్ష శరవణ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పరిచారక అర్చకుడిగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. శ్రీ హర్ష శరవణ కుమార్‌కు ఈ అవకాశం రావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఉకల్, చింతలపల్లి గ్రామాల ప్రజలు సముద్రాల కుటుంబాన్ని అభినందిస్తూ, శ్రీ హర్ష శరవణ కుమార్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో విశిష్ట సేవలందించి మరింత పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని ఆకాంక్షించారు.
🏠 Home