ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టేందుకు రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి జి. చిన్నారెడ్డిని ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను కమిటీ కన్వీనర్‌గా నియమించిన ప్రభుత్వం, పలు రంగాలకు చెందిన నిపుణులను సభ్యులుగా చేర్చింది.