వచ్చే నెల నుంచి మళ్లీ 'ఉపాధి' పనులు - వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం!

ఉపాధి హామీ పథకం జీ రాంజీలో భాగంగా వర్షాకాలంలో రెండు నెలలు పాటు పనులకు విరామం ఇచ్చారు. ఎందుకంటే వ్యవసాయ సీజన్‌లో కూలీలు అందుబాటులో ఉండేందుకు దీనిని నిలిపి వేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ఈసారి ఎల్​నినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల విరామం లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. అక్టోబర్ వరకు వర్షాభావం : నిజానికి రాష్ట్రంలో వర్షాకాలం సీజన్​ ఎప్పటిలాగే ఉంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జీరాంజీ పథకాన్ని నిలిపి వేయాల్సి ఉండేది. కానీ ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం...