తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన వరి కొనుగోలు అంచనాను బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్ భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం...