ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి..

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌కు ఓ యువతి అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు. దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో రియా యాదవ్ అనే యువతి ఈ సాహసానికి పాల్పడ్డారు. వర్షంలో హుడీ, టోపీ ధరించి పోలీసు వ్యాన్ ఎదుట నిల్చున్న ఆమెను చూసి.. అక్కడి నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్పటికే అదుపులోకి...