చైనా ఓపెన్‌: ముగిసిన సింధు పోరాటం..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఆతిథ్య చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయి చేతిలో 21-16, 20-22, 18-21 తేడాతో ఓటమి పాలైంది. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ పోరు.. టోర్నీలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. హోరాహోరీ పోరు సాగిందిలా.. మొదటి గేమ్‌లో ఆరంభంలో వెనుకబడిన సింధు అద్భుతంగా పుంజుకుంది. విరామ సమయానికి 6-11తో వెనుకబడినా.. వరుసగా 7 పాయింట్లు సాధించి 21-16తో గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించిన భారత క్రీడాకారిణి.. 7-3 ఆధిక్యం సాధించి విరామ...