ఆక‌లి త‌గ్గిందా.. ఏమీ తినాల‌నిపించడం లేదా.. అందుకు కార‌ణాలు ఇవే.

ఆకలి తగ్గిపోవడం అంటే చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక బరువు తగ్గడం, బలహీనత, అలసట వంటి సమస్యలు వ‌స్తాయి. కొన్నిసార్లు అనారోగ్యం, ఒత్తిడి లేదా జీవనశైలి కారణంగా ఆకలి తగ్గుతుంది. అయితే కొన్ని సులభమైన అలవాట్లను పాటించడం ద్వారా ఆకలిని సహజంగా పెంచుకోవచ్చు. ఒకవేళ ఆకలి రెండు వారాలకు పైగా తగ్గిపోవడం లేదా అనుకోకుండా బరువు తగ్గడం కొనసాగితే వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. ఆకలి అవ‌కపోయినా భోజన సమయాలను ముందుగానే నిర్ణయించుకోవడం మంచిది. ప్రతిరోజూ ఒకే సమయానికి తినే అలవాటు చేసుకుంటే శరీరం క్రమంగా ఆ సమయానికి ఆకలిని కలిగిస్తుంది. ముఖ్యంగా పనుల్లో బిజీగా ఉండేవారికి...