ఏకధాటిగా వర్షాలు - ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు : సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా సింగరేణి సంస్థ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఉపరితల గనుల్లో రోజుకు వంద టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లో భారీగా వరద చేరడంతో భారీ యంత్రాలు యార్డుకే పరిమితమయ్యాయి. మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనివల్ల మట్టిని తొలగించే...