20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం - సీఎం రేవంత్​ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్​లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి హైదరాబాద్​ బయల్దేరిన ఇండిగో (6e717) విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్​లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ల్యాండింగ్​కు క్లియరెన్స్ రాలేదు. దాంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడు. 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. బుధవారం రాత్రి 8:35 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. విమానంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజులు దిల్లీలో...