యాంటీ బయాటిక్స్ మందులను వాడుతున్న వారు ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి..
యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మందులు తీసుకునే సమయంలో ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే మందుల ప్రభావం తగ్గడమే కాకుండా విరేచనాలు, జీర్ణాశయ అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే యాంటీ బయాటిక్స్ వాడుతున్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి, వేటిని నివారించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాంటీ బయాటిక్స్ ను వాడే సమయంలో శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా కొంత మేర దెబ్బతింటుంది. దీంతో విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు వంటి ఆహారాలను...