E20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు

ఇథనాల్‌ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌కు తెలిపారు. (Nitin Gadkari) అయితే ఈ ఇంధనం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు పరీక్షల్లో తేలలేదని చెప్పారు. గురువారం లోక్‌సభకు, బుధవారం రాజ్యసభకు వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, వాహన తయారీదారులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం E20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని తేలిందని అన్నారు. అయితే 2016కు ముందు తయారైన కొన్ని బీఎస్-3 వాహనాలకు సాధారణ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు...