ఇజ్రాయెల్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసిన ఇండియా..

గాజా యుద్ధం కోసం భార‌తీయ కంపెనీలు సుమారు 2596 ఆయుధ షిప్‌మెంట్ల‌ను ఇజ్రాయ‌ల్‌కు పంపిన‌ట్లు ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్(Amnesty International) పేర్కొన్న‌ది. గురువారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేసింది. ఇండియా నుంచి ఇజ్రాయెల్‌కు సుమారు 2500పైగా ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఆ నివేదిక‌లో వెల్ల‌డించారు. దీని వ‌ల్ల గాజాలో మార‌ణ‌హోమం పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా రిపోర్టులో అభిప్రాయ‌ప‌డ్డారు. 2023 అక్టోబ‌ర్ 7వ తేదీ నుంచి వివిధ కంపెనీలు భార‌త్ నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధాల‌ను స‌ర‌ఫరా చేసిన‌ట్లు రిపోర్టులో వెల్ల‌డించారు. పాల‌స్తీనియ‌న్ల‌పై మార‌ణ‌హోమం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నా.. భార‌త్ మాత్రం త‌మ ఆయుధాల‌ను ఇజ్రాయెల్‌కు అంద‌జేస్తున్న‌ట్లు ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ పేర్కొన్న‌ది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఇజ్రాయెల్‌కు...