సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల ( Tirumala ) లో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై , ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు , సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు.15వ తేదీన సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం....